ఆ అనుభవం చాలా బాగుందంటున్న ఆ హాట్ హీరోయిన్ ఎవరంటే..

875

బాలీవుడ్ రొమాంటిక్ కింగ్ షారుక్ ఖాన్ సరసన ‘రబ్ నే బనాదీ జోడీ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. అందాల భామ అనుష్క శర్మ. ఈ చిత్రం తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన ‘బ్యాండ్ బాజా బరాత్’ చిత్రంతో మంచి నటనతో ఆకట్టుకుంది. రణ్ వీర్ సింగ్ హీరోగా పరిచయమైన ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

బాలీవుడ్ లో అగ్ర హీరోలు.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లతోపాటు ఇతర యువ హీరోలతోనూ నటించిన ఈ సుందరి ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలసి ఓ చిత్రంలో నటిస్తోంది. భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లాడిన అనుష్క.. మ్యాచుల్లో విరాట్ ఫెయిలైన ప్రతిసారీ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

అనుష్క శర్మ ఇటీవ‌ల నటించిన చిత్రం సూయిధాగా. ఈ సినిమా కోసం సైకిల్ పై చిత్రించిన దృశ్యాలు క‌ష్టంగా ఉన్నా ఆ అనుభ‌వం బాగుంద‌ని అనుష్క అంటోంది. ఇప్పటివరకు తాను సైకిల్ పై కూర్చోలేదని, తానెప్పుడూ సైకిల్ వాడలేదని చెబుతోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న సూయిదాగా చిత్రంలో అనుష్క వేషధారణ, అభినయం గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో అచ్చం గ్రామీణ యువతిగా, చీరకట్టులో అనుష్క శర్మ కనిపిస్తోంది. కాగా, ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.