అను ఈసారి ఎవరితో రొమాన్స్ చేస్తుందంటే..

303

తెలుగులో నేచురల్‌ స్టార్‌ నాని సరసన మజ్ను చిత్రంలో నటించి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.. అందాల భామ అను ఇమ్మాన్యుయేల్‌. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

అయితే మజ్ను చిత్రం తర్వాత అగ్ర హీరోలు, యువ హీరోలతో కలసి నటించినప్పటికీ ఒక్క చిత్రం కూడా ఆమెకు విజయాన్ని అందించలేదు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరసన నటించిన అజ్ఞాతవాసి, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన నటించిన నా పేరు సూర్య – నా పేరు ఇండియా, గోపీచంద్‌ సరసన నటించిన ఆక్సిజన్, రాజ్‌ తరుణ్‌ సరసన నటించిన కిట్టూ ఉన్నాడు జాగ్రత్త.. ఇలా చేసిన సినిమా చేసినట్టు బోల్తా కొట్టేసింది. అయినా అమ్మడు తన హవా కొనసాగిస్తోంది.

ప్రస్తుతం అను చేతిలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న శైలజారెడ్డి అల్లుడు ఒక్కటే చేతిలో ఉంది. దాసరి మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపైనే ఈ ముద్దుగుమ్మ తన ఆశలన్నీ పెట్టుకుంది. కాగా, తాజాగా తమిళంలోనూ ఒక క్రేజీ ఆఫర్‌ను కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో విజయ్‌ సేతుపతితో అను ఇమ్మాన్యుయేల్‌ జట్టుకట్టనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో తన మొదటి చిత్రం తుప్పరివాలన్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో విశాల్‌ హీరోగా నటించాడు.