ఆ సినిమా అల్లు అరవింద్ కు అంత నచ్చిందా?

366

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరు.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. మెగాస్టార్ చిరంజీవితో, తమ కుటుంబ హీరోలు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో ఎక్కువ సినిమాలు చేసిన అరవింద్ ఈమధ్య కాలంలో బయటి హీరోలతోనూ సినిమాలు చేస్తున్నారు. గతంలో నేచురల్ స్టార్ నానితో ‘భలే భలే మగాడివోయ్’ నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అరవింద్ ఈసారి సినిమా సినిమాకి తన రేంజును పెంచుకుంటున్న విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ చిత్రాన్ని నిర్మించి భారీ హిట్ కొట్టారు.

తాజాగా, అంతా కొత్తవాళ్లతో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మించిన ‘పేపర్ బోయ్’ చిత్రాన్ని అల్లు అరవింద్ విడుదల చేయనున్నారు. ఈమేరకు ఆ చిత్రం పంపిణీ హక్కులను చేజిక్కించుకున్నారు. సినిమా ప్రివ్యూ చూశామని, చాలా బాగుండటంతో తమ గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా ‘పేపర్ బోయ్’ విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది.

జయశంకర్ దర్శకత్వంలో సంతోష్ శివన్, రియా సుమన్, తన్య హోప్ ప్రధాన పాత్రల్లో ‘పేపర్ బాయ్’ తెరకెక్కింది. భీమ్స్ సంగీత దర్శకత్వంలో సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్, రమేశ్ బాలా తదితరులు కూడా ఈ చిత్రం టీజర్ ను ప్రశంసించారు. తాజాగా ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమా పంపిణీ హక్కులు తీసుకోవడంలో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపుయ్యాయి.