అలెగ్జాండ‌ర్ ఆఖరి నగరం బయటి పడిందోచ్..!

1225

అలెగ్జాండ‌ర్ ది గ్రేట్‌.. క్రీ.శ‌.356లో జ‌న్మించిన అలెగ్జాండ‌ర్ మాసిడోనియా (ప్ర‌స్తుతం గ్రీస్ దేశంలోని ఒక ప్రాంతం) దేశానికి రాజు. తండ్రి ఫిలిప్ ను బాడీగార్డులు హ‌త్య చేసిన త‌ర్వాత‌ 20 ఏళ్ల‌ చిన్నవ‌య‌సులోనే రాజుగా ప‌ద‌వీ బాద్య‌తలు చేప‌ట్టి ప్ర‌పంచ విజేత కావాల‌నుకున్నాడు. కంటికి క‌నిపించినంత భూమిని ఆక్ర‌మించుకున్నాడు. అలా ట‌ర్కీ, ఇరాక్‌.. ఇరాన్‌.. సిరియా, ఆఫ్ఘ‌నిస్తాన్‌ల‌ను జ‌యించాడు.

త‌ర్వాత‌ సింధు న‌ది దాటి మ‌న‌దేశంలోకి ప్ర‌వేశించి జీలం, చీనాబ్ నదుల మ‌ధ్య ప్రాంతాన్ని పాలిస్తున్న పురుషోత్త‌ముడు యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో అలెగ్జాండ‌ర్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నాడు పురుషోత్త‌ముడు. చివ‌ర‌కు ఈ యుద్ధంలో విజ‌యం సాధించిన మ‌ళ్లీ వెనుదిరిగి వెళ్తూ అనేక ప‌ట్ట‌ణాల‌ను, న‌గ‌రాల‌ను నిర్మించాడు. 20 ఏళ్ల‌కు రాజైన ఈ వీరుడు.. 30 ఏళ్ల వ‌ర‌కు యుద్ధాలు చేస్తూ రాజ్య విస్త‌ర‌ణ‌లోనే కాలం గ‌డిపాడు. ఇండియా నుంచి తిరిగెళ్తూ ఇరాక్‌లోని బాబిలోన్ అనే న‌గ‌రంలో 32 ఏళ్ల చిన్న వ‌యసులోనే చనిపోయాడు.

ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా న‌గ‌రాన్ని అలెగ్జాండ‌ర్ నిర్మించాడు. ఆనాటికి పెద్ద న‌గ‌రంగా ఉన్న బాబిలోన్‌ను ఇంకా విస్త‌రించి రాజ‌ధానిగా చేసుకుందామ‌నుకున్నాడు. ఇలా మొత్తం 20 న‌గ‌రాల‌కు పైగా నిర్మించాడు. అయితే వాటిలో చాలా వ‌ర‌కు ఇప్పుడు గుర్తించ‌డానికి వీల్లేకుండా ఉన్నాయి.

వీటిలో దాదాపు 2000 ఏళ్ల కిందటి చారిత్రక నగరం ఆచూకీని శాస్రవేత్తలు కనుగొన్నారు. ‘ఆలెగ్జాండర్‌ ది గ్రేట్‌’ నిర్మించినట్టుగా చెబుతున్న ఆ నగరం ఆనవాళ్లు ప్రస్తుతం ఇరాక్‌లో బయటపడ్డాయి. ఆ నగరం పేరు ‘ఖలాట్గ డర్బాండ్‌’. ఉత్తర ఇరాక్‌లో ఉన్న ఈ నగరాన్ని డ్రోన్‌ కెమేరాల ద్వారా బ్రిటీష్‌ మ్యూజియమ్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇరాక్‌, ఇరాన్‌ మధ్య రహదారి మార్గంలో గల ఈ నగరం క్రీ.పూ. 1 లేదా 2 శతాబ్దాలకు చెందినదని భావిస్తున్నారు. ఇలా రెండు వేల క్రితం నాటి ఒక చారిత్రక న‌గ‌రం బ‌య‌ట‌ప‌డింది.