పంజాబ్ ఆఫీసర్లూ.. మీకు భారతరత్న ఇయ్యాల్సిందేరా..!

600

చూసి రమ్మంటే కాల్చేసి వచ్చే రకాలు.. చాలా మంది మన మధ్యలోనే ఉంటారు. ఒకటి చెబితే ఇంకోటి చేస్తారు. ఇది చెప్తే అదిచేస్తారు. అది చెప్తే ఇది చేస్తారు. మొత్తానికి చెప్పిన పని కాకుండా కొత్తగా.. పరమ చెత్తగా మరొకటి చేసి వస్తారు. ఇంట్లోనో,ఫ్రెండ్స్ మధ్యలోనో ఇలాంటివి జరిగితే ప్రాబ్లమ్ లేదు. కానీ.. ఓ  సీరియస్ ఇష్యూను కూడా సిల్లీగా తీసుకుని ఒకటి చెబితే..మరొకటి చేస్తే ఎలా ఉంటుంది..? అచ్చంగా పంజాబ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్లు ఇదే పని చేశారు. వీళ్ల పనితో ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుకఊడినంత పనైంది. ఇంతకీ పంజాబ్ ఎయిడ్స్ కంట్రోల్ అధికారులు ఏం చేశారో తెలిస్తే మీరు నాలుగు తగిలిస్తామంటారు.

ఎయిడ్స్ అనే ఓ మహమ్మారి. అది ఎలా వ్యాపిస్తుందో కూడా చాలామందికి తెలుసు. పెద్దవాళ్లకే కాదు.. స్కూళ్లో చదువుకునేపిల్లవాళ్లకు కూడా తెలుసు. ఎలా వ్యాపించదో కూడా చాలామందికి తెలుసు. ఎయిడ్స్ ఉన్నవారితో చేతులు కలిపినా.. వారితోకలిసి ఉన్నా.. వాళ్లు వాడిన వస్తువులు వాడినా ఎయిడ్స్ రాదు.

కానీ పంజాబ్ అధికారులు ఏం చేశారో తెలుసా..? దీనికి పూర్తిగా రివర్స్ లో ప్రచారం మొదలుపెట్టారు. ఏదో నోటిమాటగాప్రచారం కాదు. ప్రాంతీయ భాషలో పాంప్లెట్స్ కొట్టించి మరీ పంచిపెడుతున్నారు. ఇంతకీ ఇందులో ఏముందో తెలుసా..?
1.ఎయిడ్స్ ఉన్నవారికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎయిడ్స్ వ్యాపిస్తుంది.
2.ఎయిడ్స్ ఉన్నవారు వాడిన ప్లేట్లు, పాత్రలు వాడినా ఎయిడ్స్ వస్తుంది
3.ఎయిడ్స్ ఉన్నవారు వాడిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వాడినా ఎయిడ్స్ వస్తుంది.

ఇంతవరకు ఓకే.. ఏదో తెలియక తప్పుగా ప్రచారం చేశారనుకుందాం. కానీ వీళ్ల పైత్యం ఎక్కడిదాకా వెళ్లిందంటే. చివరకు.. ఎయిడ్స్ ఉన్నవారు వాడిన టాయిలెట్లు వాడినా ఎయిడ్స్ వస్తుందని పాంప్లెట్స్ ప్రింట్ చేయించి జోరుగా ప్రచారంచేస్తున్నారు. ఈ పాంప్లెట్స్ చూసి బిత్తరపోయి, మైండ్ బ్లాంక్ అయిన ఓ జర్నలిస్టు దీని గురించి వార్త రాశారు. దీంతో ఇప్పుడితోహాట్ టాపిక్ గా మారింది.

ఎయిడ్స్ పై ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించి.. వారిలో అవగాహన కల్పించాలని సర్కారు కోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ.. ఇలా ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీలు పెట్టి.. అధికారులకు జీతాలు ఇస్తోంది. వాళ్లేమో ఇలా.. ఉల్టా ప్రచారంతో ప్రజలకు గుండెదడ పెంచేశారు. దీంతో పంజాబ్ సర్కార్ పరువు బజారున పడినంత పనైంది.