ఆ దర్శకుడు వర్షం పడుతున్నా ఆ నటిని వదిలిపెట్టలేదంట!

796

నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో.. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ చిత్రం సెప్టెంబర్ 13న వినాయకచవితి పర్వదినాన విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కాగా, సెప్టెంబర్ 15 రమ్యకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని ఈ భామ మీడియాతో ముచ్చటించి అనేక విషయాలు పంచుకుంది.

దర్శకుడు మారుతి చాలా వేగంగా షూటింగ్ చేసేవాడని, సీన్ కంప్లీట్ చేసి వచ్చి కూర్చునేలోపే మళ్లీ షాట్ అనేవాడని చెప్పుకొచ్చింది. అసలు గ్యాప్ ఇచ్చేవాడు కాదంటూ వివరించింది. మిషన్ లా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాడని తెలిపింది. ఒక రోజు వర్షం పడుతున్నా వదలకుండా ఆ గ్యాప్ లో కూడా షూటింగ్ చేయడంతో ఆశ్చర్యపోయానంది. మరి సీనియర్ గా మారుతిని టీజ్ చేశారా అంటే.. అంత టైమ్ అతను నాకెక్కడ ఇచ్చాడంటూ నవ్వేసింది.

దర్శకుడిగా మారుతికి మంచి భవిష్యత్ ఉందని, తన కెరీర్ లో అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుని విడుదలైన చిత్రం.. శైలజారెడ్డి అల్లుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది.. రమ్యకృష్ణ. కథను బట్టి ఏ పాత్ర చేయడానికైనా తాను సిద్ధమని, అది అత్త పాత్ర అయినా, అమ్మ పాత్రయినా ఫరవాలేదని స్పష్టత నిచ్చింది.. ఈ అందాల భామ. నేటితో ఐదు పదుల వయసుకు చేరుకుంటున్న ఈ భామకు అంత వయసు ఉందంటే నమ్మడం చాలా చాలా కష్టం.