ఆ సినిమాలో వైఎస్ జగన్ గా నటించే హీరో ఎవరంటే..

879

వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటి దృష్టి సినిమాలపై కూడా పడింది. సినిమాల ద్వారా ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించడానికి అవకాశం ఉండటంతో తమకు అనుకూలమైన కథలతో, పాత్రలతో ఆయా వ్యక్తులకు తెరవెనుక ఉండి సినిమాలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో రాష్ట్ర చరిత్రలోనే ఇద్దరు గొప్ప ముఖ్యమంత్రులుగా పేరొందిన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిల జీవిత కథలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి.

mammootty’s new telugu movie ysr biopic yatra

ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రమే.. “యాత్ర’. మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి.. వైఎస్సార్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి మహి వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా, వైఎస్సార్ కుమారుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ప్రముఖ తమిళ నటుడు కార్తీ నటించనున్నట్టు సమాచారం. కార్తీ సోదరుడు ప్రముఖ హీరో సూర్యకు, జగన్ కు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో కార్తీ ఈ సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి పాత్రలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కనిపించనున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో సుహాసిని, రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి నటించనున్నారు. మరో అందాల భామ, ప్రముఖ యాంకర్ అనసూయ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలు సృషిస్తుందో వేచిచూడాల్సిందే..