ఆ హీరోతో నటించడానికి 15 మంది హీరోయిన్లు నో చెప్పారట!

224

‘పెళ్లిచూపులు’ సినిమాతో హిట్ కొట్టి.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికే రాత్రే స్టార్ అయిపోయాడు.. విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘గీతగోవిందం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ‘ఛలో’తో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మంధన నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు పెంచింది.

ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశాడు. గీతగోవిందం కథను తాను 15 మంది హీరోయిన్లకు చెప్పానని, అయినా ఒక్క హీరోయిన్ కూడా సినిమాలో చేయడానికి అంగీకరించలేదని బాంబుపేల్చాడు. విజయ్ దేవరకొండ కొత్త హీరో కావడం, తాను అప్ కమింగ్ డైరెక్టర్ ను కావడమే దీనికి కారణమని అనుకుంటున్నానని వెల్లడించాడు. అయితే సినిమాలో నటించడానికి తిరస్కరించిన హీరోయిన్లను తాను తప్పుపట్టనని, వారికి కూడా టాప్ హీరో, టాప్ దర్శకుల చిత్రాల్లో నటించాలని ఉంటందని చెప్పాడు.

అయితే.. ‘గీతగోవిందం’లో నటించడానికి రష్మిక మంధన అంగీకరించిందని, ఆమె కోసమే ఈ పాత్ర పుట్టిందని చెప్పుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు తెలిపాడు. తన దగ్గర ఇంకా రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని, లైన్ ను డెవలప్ చేయాల్సి ఉందని వివరించాడు.